20, జులై 2011, బుధవారం

నా దబరని కాపాడండి సారో!!!



1995 వ సంవత్సరం శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా, కావలి మండలం, పెద్దవరం ప్రాధమిక పాఠశాలలో హెడ్ మాస్టర్ గా నేను, అసిస్టెంట్ గా పనిచేస్తున్న జిలాని భాషా పని చేస్తున్న సమయంలో ఎదురైన అరుదైన అనుభవం ఇది.

ఓ మధ్యాహ్నం భోజనానికని ఇంటికి వెళ్ళిన ఓ విధ్యార్ధి ఆడుకుంటూ తన తలను ఓ దబరలో మెడవరకు దూర్చి తిరిగి తీయలేక పోయాడు. ఎంత ప్రయత్నం చేసినా దాన్ని తిరిగి తీయలేక పోయారు. ఆ విషయం మా దృష్టికి రావటంతో, హుటా హుటిన వాడి దగ్గరకి వెళ్ళి తలను జాగ్రత్తగా తీయటానికి ప్రయత్నింఛాము, కాని మాకు సాధ్య పడలేదు. అది ఒక మారుమూల గ్రామం కావటం అంతేకాక బస్ మరియు రోడ్ సౌకర్యం కూడా లేకపోవటం వల్ల ఈ రోజుల్లోలాగా 108 సౌకర్యం లేకపోవటం వల్ల ఏమి చేయాలో తోచలేదు. టీచర్లం కావటంతో ఆ సమస్యని తీర్చే బాధ్యత మా భుజాల మీద పడింది. అప్పుడు ఎక్కడినుండో అక్సా బ్లేడ్ సంపాదించి దానితో ఆ దబరని జాగ్రత్తగా కోయటం మొదలు పెట్టేము. ఇంతలో వాళ్ళ అమ్మ వచ్చి " సార్!! ఆ దబరని వంద రూపాయలు పెట్టి నిన్నే మా ఆయన కొన్నాడు సార్!! అది పాడయితే మా ఆయన కొడతాడు. ఆ దబరని జాగ్రత్తగా చూడండి సార్! " అని వేడుకుంది.

వాడి తలకి ఆ బ్లేడ్ తగిలి ఎక్కడ గాయంవుతోదోనని మా భయం, అదీ గాక గాలి ఆడక ఇంకేదైనా ప్రమాదం జరుగుతుందేమో నని ఆందోళనతో ఉన్న మాకు ఆమె అన్న మాటలకు నవ్వాలో ఏడవాలో అర్ధం కాక ఒకరి ముఖాలు మరొకరం చూసుకున్నాం.

3 కామెంట్‌లు:

  1. సారూ, మీ దబర అనుభవం చాలా బాగుంది ఇంతకి తల వచ్చిందో చెప్పలెదు, ఇలాంటి అనుభవాలు మరన్ని తెలియచేయాలని కోరుకుంటూ..

    రిప్లయితొలగించండి
  2. చాలా బావుంది మాస్టారూ. మారు మూల పల్లెల్లో నిరుపేద బతుకుల నిజాలు , వారి అమాయకత్వం .. మరిన్ని అనుభవాలు మాతో పంచుకోగలరు.

    రిప్లయితొలగించండి
  3. ధన్యవాదాలు సార్.గ్రామీణ నిరుపేదల సామాజిక పరిస్థితులపై మీకున్న ఆసక్తిని అభినందిస్తున్నాము...

    రిప్లయితొలగించండి