24, జులై 2011, ఆదివారం

మానవత్వమా!...దీనికంటే గొప్పది ఉందా?



ఒక రోజు ఉదమయం పది గంటల ప్రాంతం. శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా, కావలి ట్రంకురోడ్డు పై, ఓ కోతి ఏదో వాహనం క్రింద పడి చనిపోయి ఉంది. రోడ్డుపై ఎంతోమంది జనం అంటే నాతో సహా దాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా అటూ ఇటూ ఎవరి ధోరిణిలో వారు వెళ్తూ ఉన్నారు. ఆ సమయం లో మరో కోతి ట్రాఫిక్ ను తప్పించుకుంటూ వచ్చి ఆ చనిపోయిన కోతిని ఎత్తి భుజంపై వేసుకోవటానికి ఎంతో ప్రయత్నించింది. అది భుజాన వేసుకోవటం, జారిపోవటం... కాసేపు ఎడం వైపు మరోసారి కుడి వైపు భుజం మీద వేసుకుంటూ వచ్చే పోయే వాహనాల బారినుండి దాన్నీ తప్పిస్తూ, తను తప్పించుకుంటూ కనీసం ఓ గంట సేపు ప్రయత్నించింది. చివరికి ఆ కోతిని తీసుకుని వెళ్ళిపోయింది. ఆ సంఘటనని చూస్తూ నిలబడిపోయిన మేము మానవత్వం కంటే గొప్పదైన ఏదో శక్తి ఉందని భారమైన మనస్సుతో అక్కడినుంచి కదలిపోయాము.

'ఆ బ్రతికి ఉన్న కోతి ఉద్దేశ్యం చనిపోయిన కోతిని దిక్కులేకుండా అనాధగా వదిలివేయకుండా ఉంచడమే" అన్న విషయం గుర్తుకొచ్చినప్పుడల్లా మనస్సు దిగులుగా అయిపోతుంది.

1 కామెంట్‌:

  1. కోతి నుండే మనిషి వచ్చాడన్నది డార్విన్ సిద్దాంతం. మరి కోతికున్న ఈ మాత్రం తత్వం మనుషులకు ఎందుకు అందలేదో..!! మనిషి మనిషే ఎప్పటికైనా.. జంతువులకే తోటి ప్రాణం విలువ తెలుసు. మనకి తెలీదు. మనం మారం. మనం ఘనులం కదా!! ఇలాంటి విషయాలు గుర్తొస్తే మనసు కకలావికలం అవుతుంది.

    రిప్లయితొలగించండి